శ్రీవారి సేవలో సీఎం ఫ్యామిలి.. అన్న ప్రసాద భవనంలో వడ్డించిన చంద్రబాబు

 శ్రీవారి సేవలో సీఎం ఫ్యామిలి.. అన్న ప్రసాద భవనంలో వడ్డించిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  చంద్రబాబు కుటుంబంతో కలిసి తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.ఆయన మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో ఆలయ పండితులు వేద ఆశీర్వచనం అందించి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

తిరుమల శ్రీవారి దర్శనానంతరం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో  ముఖ్యమంత్రి చంద్రబాబు  కుటుంబ సభ్యులతో కలిసి స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించారు. ఈ సందర్భంగా భక్తులతో మాట్లాడుతూ టీటీడీ అందిస్తున్న సౌకర్యాలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. సౌకర్యాలు అద్భుతంగా ఉన్నాయని భక్తులు ..ముఖ్యమంత్రి దగ్గర సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం భక్తులతో కలిసి ఆయన భోజనం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు  మనువడు  నారా దేవాన్ష్‌ పుట్టినరోజు సందర్భంగా తిరుమలలో ఒక్కరోజు అన్నప్రసాదానికి అయ్యే రూ.44లక్షల ఖర్చున నారా లోకేష్ విరాళంగా అందించారు